2022-2023 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే ఆగస్టు 16తోనే దరఖాస్తుల గడువు ముగిసినా అభ్యర్థుల కోరిక మేరకు దీనిని ఈ నెల 30వ వరకు పొడిగించారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. గరిష్ట కాల వ్యవధిలో కోర్సు పూర్తి చేయలేని అభ్యర్థులకు రీ అడ్మిషన్ అవకాశం కూడా యూనివర్సిటీ కల్పించింది.