అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

0
100

మీరు తెలంగాణలో డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? అది కూడా కాలేజీకి వెళ్లకుండా..అయితే ఈ సదావకాశం మీకోసమే.. డా. బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తులు జూన్ 30 నుంచే ప్రారంభం కాగా, గడువు తేదీని జూలై 31 వరకు నిర్ణయించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు  వెబ్‌సైట్: https://www.braouonline.in/ను సంప్రదించాలని పేర్కొంది.

డిగ్రీ అడ్మిషన్లకు https://www.braouonline.in/UGFirstyear/FirstHome.aspx ఈ లింక్ క్లిక్ చేయండి.

పీజీ అడ్మిషన్లకు https://www.braouonline.in/PGFirstyear/FirstHome.aspx ఈ లింక్ క్లిక్ చేయండి.

డిగ్రీ కోర్సులు: B.A., B.Com., B.Sc..

పీజీ కోర్సులు: M.A., M.Com., M.Sc., M.B.A.,BLISc., M.LISc., P.G.డిప్లొమా

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 30,2022

దరఖాస్తు చివరి తేదీ: జూలై 31,2022