తెలంగాణ గురుకుల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు..పూర్తి వివరాలివే..

0
110

తెలంగాణ విద్యార్థులకు గమనిక. రాష్ట్రంలోని రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రవేశ తరగతి, పాఠశాలల వివరాలు, అర్హత, దరఖాస్తు వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాఠశాలలు: టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ- ఏటూరు నాగారం (సీట్లు-40), టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ- చేగుంట (సీట్లు-40)

ప్రవేశం కల్పించే తరగతి: 5

అర్హతలు: నాలుగో తరగతి ఉత్తీర్ణత. తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు లక్షలు/1.5 లక్షలు మించరాదు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 8

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www. tgtwgurukulam.telangana.gov.inను సందర్శించండి.