రాయలసీమలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పాయి… చాలా కాలంగా ఫ్యాక్షన్ కు దురంగా ఉంటున్న ప్రజలు ఈ ఘటన ఒక్కసారిగా అలజడి రేకెత్తిస్తోంది… ఈ ఘటన కర్నూల్ జిల్లా కోసిగిలో జరిగింది… సుమారు ఏడుగురిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు…
ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేష్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్లు తెలుస్తోంది… ఈ రెండు కుటుంబాల మధ్య గొర్రెల విషయంలో కొద్దికాలంగా వివాదం తలెత్తింది…
ఇది కాస్త చిలికి చిలికి హత్యల వరకు దారి తీసింది… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు… ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు భారీ బలగాలను కొసిగి ప్రాంతాని తరలించారు… ప్రస్తుతం గాయపడిన వారికి ఆదోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు…