అగ్ర కులం అమ్మాయిని ప్రేమించినందుకు దళితుడిని కొట్టి చంపిన వైనం…

అగ్ర కులం అమ్మాయిని ప్రేమించినందుకు దళితుడిని కొట్టి చంపిన వైనం...

0
101

ప్రేమకు కులం, మతం, వర్ణం, జాతీ అనే తేడా ఉండదు… ప్రేమ ఎవరికైనా పుట్టొచ్చు, ఎవరిమీద అయినా పుట్టోచ్చు… ఫలానా అబ్బాయి ఫలానా కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాలని ఎక్కడా లేదు… ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయి ప్రేమించి పెళ్లి చెసుకుంటే తప్పులేదని వేరు కులానికి చెందిన అబ్బాయి ప్రేమిస్తే తప్పు అని అంటారు…

తాజాగా అగ్ర వర్ణ కులానికి చెందిన అమ్మాయిని ఒక దళితుడు ప్రేమించినందుకు అతని కొట్టి చంపారు… ఈ సంఘటన పూణేలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… విరాజ్ జాగ్తాప్ అనే యువకుడు అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు… దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబ సభ్యులు విరాజ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు…

ఇంట్లో అతనిని కులం పేరుతో దూషించి అవమానించి పంపించారు….. ఆతర్వాత విరాజ్ తన బైక్ పై వెళ్లాడు… అయితే మధ్యలో అమ్మాయి తరపు బంధువులు ఆరుగురు అతడనిని అడ్డుకున్నారు… విరాజ్ పై టెంపోతో డాడి చేశారు దీంతో అతడు కింద పడిపోయాడు… ఆతర్వాత అతడిపై ఉమ్మి వేస్తూ రాళ్లు కర్రలతో దాడి చేశారు.. రక్తపు మడుగులో ఉన్న అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు… విరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.. ఆ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…