ఐరావతం అంటే ఏమిటి -పుట్టుక ఇంద్రుడి వాహనం ఎలా అయింది ?

ఐరావతం అంటే ఏమిటి -పుట్టుక ఇంద్రుడి వాహనం ఎలా అయింది ?

0
283
4x5 original

ఐరావతం ఈ పేరు మనం సాధారణంగా సినిమాల్లో వింటూం ఉంటాం.. పురాణాలు ఇతిహాసాలు చదివి వినే సమయంలో కూడా ఈ మాట వింటూ ఉంటాం, ఐరావతం అంటే తెల్లని ఏనుగు, ఇది ఇంద్రుడి వాహనం అనేది తెలిసిందే, మరి ఈ ఐరావతం పుట్టుక ఏమిటి అనేది తెలుసుకుందాం.

పూర్వం పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీ దేవి, కల్పవృక్షము, కామధేనువులతో పాటు ఈ ఐరావతం ఉద్భవించింది అని చెబుతారు. మరో కథలో చూసుకుంటే బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయి. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించింది, ఇక మిగిలిన ఆడ ఏనుగులకి, అభరాము అనే ఏనుగు నాయకత్వం వహించింది.

కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి ఐరావతం జన్మించింది అని చెప్పబడింది, అయితే ఈ ఐరావతాన్ని ..దేవతల రాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు అని పిలుస్తారు. ఇక ఇలాంటి తెల్ల ఏనుగు గురించి చూస్తే మన దేశంలోనే కాదు థాయిలాండ్, లావోస్ వంటి దేశాలలోఅక్కడ పురాణాల్లో కూడా పూజిస్తారు.