టెలికాం రంగంలో ఇప్పుడు కొన్ని సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి… ఈ ప్రయత్నాలు వినియోగదారులకు ఎంతగానో లబ్ది చేకూరుతోంది.. ముఖ్యంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ రిజయన్స్ జీయోను ఢీ కొట్టేందుకు ఐడియా, వోడాఫోన్, ఎయిర్ టెల్, వంటి సంస్థలు కాల్ చార్జీలు డేటా చార్జీలు బాగా తగ్గిస్తున్నాయి…
ఇదే క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ వినియోగదారుల కోసం తక్కువ ధరలకు 4 జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం జియో సంస్థ 4జీ కీ పాడ్ మొబైల్ మార్కెట్ లోకి విడుదల చేసుంది….
అయితే దీనికి పోటీగా ఎయిర్ టెల్ టెలికాం సంస్థ 4 జీ స్మార్ట్ ఫోను మార్కెట్ లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…. దీని ద్వారా వినియోగదారుల సంఖ్యలను, సేవలను మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది…