అక్కడ 50వేల మంది స్త్రీలకు వివాహం కాలేదు – కారణమేంటంటే

అక్కడ 50వేల మంది స్త్రీలకు వివాహం కాలేదు - కారణమేంటంటే

0
120

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు.. ముఖ్యంగా పెళ్లి విషయంలో అదే చెబుతారు.. 25 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలి అని అంటారు, అయితే ఈరోజుల్లో కొందరు 30 ఏళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు.. జీవితంలో ఇంకా ఎదగాలి కారు ఇళ్లు ఇలా అన్ని కొనుక్కోని అప్పుడు వివాహం చేసుకుంటాను అంటున్న యువత చాలా మంది ఉన్నారు.

ఇక అమ్మాయిలు కూడా కొందరు 30 వచ్చినా పెళ్లిపై ఏమి మాట్లాడటం లేదు.. ఓ రాష్ట్రంలో మాత్రం . పెళ్లీడొచ్చినా, వయసు మీద పడి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇదేమిటి ఇలా పెళ్లి కాని అబ్బాయిల గురించి వింటున్నాం అమ్మాయిలు ఉండటం ఏమిటి అని అనుకుంటున్నారా.

కశ్మీర్ లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు అవ్వక కొందరు స్త్రీలు అలాగే ఉండిపోయారు

దాదాపు 50 వేల మంది స్త్రీలు కశ్మీర్ లో పెళ్లిళ్లు కాకుండా పుట్టింట్లోనే ఉండిపోయారు.

 శ్రీనగర్ జిల్లాలోనే 10 వేల మంది మహిళలకు పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయారట.

కొందరు ఇంకా మంచి సంబంధం కోసం చూద్దాం అని అమ్మాయి తల్లిదండ్రులు , వారి వయసు పెరుగుతున్నా పెళ్లి చేయక ఆగిపోయారు, ఇంకా కొందరు ఆర్దిక కారణాలతో పెళ్లి చేయలేక ఆగిపోయారు. ఇక నేటి తరం అబ్బాయిలు చదువుకున్న అమ్మాయిలని ఉద్యోగం చేసేవారిని చేసుకుంటున్నారు.. దీంతో ఇలాంటి అమ్మాయిలు వివాహం కాకుండా అలా ఉండిపోయారు.