దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరచుకున్నాయి, అయితే కొన్ని రెడ్ జోన్లలో మాత్రం మద్యం షాపులు తెరవలేదు, గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మాత్రమే షాపులు తెరిచారు, ఇక రెడ్ జోన్ల నుంచి కూడా చాలా మంది ఆ ప్రాంతాలకు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు, ఇక మద్యం షాపుల ముందు ఎలా బారులు తీరుతున్నారో చూస్తున్నాము.
తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇక మొదటి రోజు నుంచే మందుబాబులు అందరూ మద్యం షాపుల వద్ద బారులు తీరుతూ పెద్ద క్యూ కడుతున్నారు. కాని కొన్ని చోట్ల మాత్రం మందు బాబులకు అంత ఛాయిస్ ఇవ్వడం లేదు. కొన్ని గ్రామాలలో మద్యం అమ్మకాలను జరపకూడదు అంటూ ఏకంగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం అని అందరూ అంటున్నారు..
కరీంనగర్లోని కాట్రవల్లి పంచాయతీ పరిధిలో. గ్రామ పెద్దలు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ పరిధిలో మద్యాన్ని నిషేధించారు. ఇక్కడ ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు, అంతేకాదు వారికి 10 వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు వారి ఇంటి నల్లా కనెక్షన్ కూడా తొలగిస్తున్నారు.