అక్కడ సెల్ఫీ తీసుకుంటే కేసు ఇలాంటి పని చేయకండి

అక్కడ సెల్ఫీ తీసుకుంటే కేసు ఇలాంటి పని చేయకండి

0
113

ఈ రోజుల్లో చాలా మందికి సెల్పీ మోజు బాగా పెరిగింది, ఎక్కడకు వెళ్ళినా అందరూ సెల్ఫీ తీసుకోవడం స్టేటస్ పెట్టడం చేస్తున్నారు, అయితే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, అయినా ఈ సెల్ఫీ మోజు మాత్రం తగ్గడం లేదు.

ఇక చెరువులు, సముద్రాలు దగ్గర, నదుల్లో సేల్ఫీలు దిగడం అనేది చాలా మందికి ఇష్టం. కాని వరదలు వచ్చిన సమయంలో కూడా కొందరు ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.భారీ వర్షాలు పడి భారీ వరదలు వచ్చినా సరే సెల్ఫీ దిగుతూ ఉంటారు.

ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా బేలాఖేడి గ్రామంలో పెంచ్ నది దగ్గర ఇద్దరు అమ్మాయిలూ సెల్ఫీ కోసం రాయి దగ్గరకు వెళ్ళారు. ఈ సమయంలో భారీగా వరద రావడంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని తాళ్ళ సాయంతో బయటకు లాగారు. ఇలా ప్రాణాపాయం తప్పింది, అయితే ఇక్కడ ఇక నదుల దగ్గర సెల్పీలు దిగడం సర్కార్ బ్యాన్ చేసింది.. నదుల వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు.