అక్రమ సంబంధం వల్ల రెండు ప్రాణాలు బలి….

అక్రమ సంబంధం వల్ల రెండు ప్రాణాలు బలి....

0
91

వివాహేత సంబంధం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి… ఈ సంఘటన అనంతపురం జిల్లా పెనుగొండ మండలం పత్తికుంటపల్లి గ్రామంలో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన ఉప్పల రామాంజినేయులతో మారెక్కకు వివాహం జరిగింది…

అదే గ్రామానికి చెందిన సంజీవమ్మతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఆంజనేయులకు భార్య మారెక్క అడ్డుగా ఉండటంతో గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రియురాలితో కలిసి ఆమెను కడతేర్చాడు… అప్పట్లో ఇంటి ముందే ఆమెను పాతిపెట్టాడు… అయితే గత నెల 25న రామాంజినేయులు ప్రియురాలు సంజీవమ్మను హతమార్చిన సంగతి తెలిసింది…

ఈ కేసులో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు… అయితే విచారణలో గత నాలుగేళ్లక్రితం తన భార్యను హతమార్చినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు… దీంతో కోర్టు అనుమతితో నిన్న నిందితుడిని గ్రామానికి తీసుకువచ్చి శవాన్ని వెలికి తీశారు పోలీసులు… అక్కడే పోస్టు మార్టం నిర్వహించి రెవిన్యూ అధికారుల సమక్షమంలో పంచనామా చేశారు…