అలర్ట్..హైదరాబాద్ లో నేడు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు

0
79

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు కూడా 34 సర్వీసులను నిలిపేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు వివరాలివే..

లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 9 సర్వీసులు

ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు

హైదరాబాద్‌-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు

సికింద్రాబాద్‌-లింగంపల్లి మధ్య ఒకటి

లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో ఒక సర్వీసు రద్దయ్యాయి.