అలెర్ట్..నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

-

త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకు వచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది.

- Advertisement -

ఇక తాజాగా అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు నేటి నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు.

ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...