నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. నేడు 26న రెండో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా పబ్లిక్ హాలీడేస్ గా బ్యాంకులు తెరుచుకోని సంగతి మనందరికీ తేలిసిందే. అలాగే ఈనెల 28, 29 తేదీల్లో ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్అసోసియేషన్ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు దేశ వ్యాప్తంగా బ్యాంకుల అన్నీ కూడా మూసి ఉంటాయి.
ఏప్రిల్ 1వ తేదీన ఇయర్లీ క్లోజింగ్.. దీంతో బ్యాంక్ ఓపెన్ చేసి ఉన్నా.. సేవలు ఉండవు. అలాగే ఏప్రిల్ 2వ తేదీ ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉంది. దీంతో ఆయా తేదీల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. కాగ బ్యాంకు ఖాతాదారులు ఈ సెలవులను గమనించి మిగితా రోజుల్లో బ్యాంకుకు వెళ్లాలి. కాబట్టి బ్యాంకు కస్టమర్లు సెలవులు, సమ్మెను దృష్టిలో పెట్టుకురి బ్యాంకింగ్ లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.