ఏపీకి అలర్ట్..ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

0
109

ఏపీ ప్రజలకు అలర్ట్‌. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు రాగల రెండు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.