ఏపీకి అలెర్ట్..48 గంటల్లో భారీ వర్ష సూచన

0
80

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.