గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్..టీఎస్పీఎస్సీ మరో అవకాశం

0
90

తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సుమారు 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇక దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు ఇటీవల అవకాశం కల్పించింది. ఈనెల 19 నుంచి నిన్నటి వరకు ఇచ్చిన గడువును మరోసారి పెంచింది.  ఈనెల 28 సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది.

అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్పీ పేర్కొంది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్పిఎస్పీ తెలిపింది.