పీఎం కిసాన్ రైతులకు అలెర్ట్..ఇలా చేస్తే మీ ఖాతాలోకి రూ.4000..!

0
105

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి పీఎం కిసాన్ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. ప్రతి విడతలో 2,000 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తుంది. అయితే దీనిలో కొత్త నిబంధనల ప్రకారం ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయలేదు అంటే రైతులకు ప్రయోజనం ఉండదు.

కనుక ఈ-కేవైసీ తప్పక చేయించాలి. 11వ వాయిదాకు డబ్బును పొందాలనుకుంటే, 31 మార్చి 2022లోపు e-KYC పూర్తి చెయ్యాలి. లేదు అంటే ఏప్రిల్-జూలైకి సంబంధించి రూ. 2000 వాయిదా ఖాతాల్లో జమ అవ్వవు. అయితే స్వయంగా ఈ-కేవైసీ కూడా చేసుకోచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే పీఎం-కిసాన్ వెబ్ పోర్టల్‌కి వెళ్లి, ఈ-కేవైసీ ఎంపికను సెలెక్ట్ చేసుకోచ్చు. పోర్టల్‌లో వారి నుంచి ఆధార్ నంబర్ అడుగుతారు. పోర్టల్‌లో కనిపించే వివరాలను పూర్తి చేసిన తరువాత సెర్చ్ పైన క్లిక్ చెయ్యాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. గెట్ OTPపై క్లిక్ చేయండి. రైతు మొబైల్‌కు OTP వస్తుంది.

రైతు మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే సువిధ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఇ-కెవైసిని పొందాలి. 2022 జనవరి 1న ఈ పథకం 10వ విడతలో రైతులకు రూ.2000 లభించింది. త్వరలో 11వ విడత పీఎం కిసాన్ యోజన కిందకి వస్తుంది. దరఖాస్తు చేసుకోని రైతులకు ఈ అవకాశం ఇస్తారు. స్కీమ్ కోసం తమను తాము నమోదు చేసుకుంటే రెండు వాయిదాల డబ్బును అందుకుంటారు. అప్పుడు పదో విడతలో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.4 వేలు పొందవచ్చు.