విద్యార్థులకు అలర్ట్..నోటిఫికేషన్ విడుద‌ల‌

Alert for students..degree notification issued

0
109

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థినులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

40 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఈ నెల 10 నుంచి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 23వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ ప్ర‌వేశాల‌ను ఇబ్ర‌హీంప‌ట్నంలోని సాంఘిక సంక్షేమ మ‌హిళా గురుకుల కాలేజీలోని బీఏ కోర్సుల‌కు నిర్వ‌హిస్తున్నారు. ఇత‌ర వివ‌రాల కోసం www.tswreis.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

కోర్సులు ఇవే..
1.HEP(History, Economics, political science )
2.HEPA (History Economics, public administration )
3.EPG(Economics,Political science Geography)
4.EPJ(Economics, Public Administration,Journalism )
5.EPP((Economics, Public Administration, Psychology )