తెలంగాణకు అలెర్ట్..రానున్న 4 రోజులు భారీ వర్షాలు

0
111

తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4 రోజు‌ల‌ పాటు భారీ వర్షాలు కురిసే అవ‌కాశముందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి మరా‌ఠ్వాడ, మధ్య మహా‌రాష్ట్ర, అంత‌ర్గత కర్ణా‌టక మీదుగా కొమో‌రిన్‌ ప్రాంతం వరకు సముద్ర మట్టా‌నికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉత్తర-ద‌క్షిణ ద్రోణి కొన‌సా‌గు‌తుందని తెలిపింది. దీని ప్రభా‌వంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని వివ‌రిం‌చింది.

ఈరోజు నిర్మల్‌, జగి‌త్యాల, కరీంన‌గర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, జన‌గామ, యాదాద్రి, వికా‌రా‌బాద్‌, సంగా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వర్షాలు కురిసే అవ‌కాశముందని వాతావరణ శాఖ ప్రాథ‌మిక హెచ్చరిక జారీ చేసింది.