నిరుద్యోగులకు అలెర్ట్..దరఖాస్తుకు నేడే చివరి తేదీ!

0
115

నిరుద్యోగులకు అలెర్ట్. ఇటీవల ఇండియా పోస్ట్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తమిళనాడు పోస్టల్ సర్కిల్ మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జూలై 20 చివరి తేదీ. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు ఆఫ్‌లైన్ అప్లై చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai- 600006.

విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. ఎంపికైనవారికి రూ.19,900 వేతనం లభిస్తుంది. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.

ఇటీవల పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు పోస్ట్ ఆఫీసుల్లో జాబ్స్ కోసం పోటీపడుతున్నారు. ఇండియా పోస్ట్ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్స్ కోసం https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.