మనం బైక్ తీస్తే కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అంతేకాదు బండిమీద ఇద్దరు ఉంటే ఇద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాహనం నడిపే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. కానీ కొందరు హెల్మెట్ ధరించరు. అలాంటి వారిపై కేసులు, ఫైన్లు వేస్తున్నారు పోలీసులు. అయితే మరికొందరు హెల్మెట్లు ధరించినా నాణ్యత లేని హెల్మెట్లు ధరిస్తున్నారు.
నాణ్యత లేని హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పడు వాహనదారులు మరణిస్తున్నారని పోలీసులు, రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రోడ్లకి ఇరువైపులా మనం అక్కడక్కడా చూస్తు ఉంటాం. రూ300 నుంచి హెల్మెట్లు అమ్ముతారు. మనం కింద పడితే అవి కూడా రెండు ముక్కలు అవుతాయి. మన తలకు ఎలాంటి రక్షణ ఆ నాణ్యత లేని హెల్మెట్లు ఇవ్వవు. కచ్చితంగా క్వాలిటీ హెల్మెట్ వాడాలి అని చెబుతున్నారు పోలీసులు.
నకిలీ హెల్మెట్ల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచే వాహనదారులు, నాణ్యమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ గుర్తింపు ఉన్న హెల్మెట్లను కొనుగోలు చేయాలని తెలిపింది. అవి మాత్రమే వాహనదారులు ధరించాలి.నకిలీ హెల్మెట్ వాడితే జరిమానాలు విధించాలని సూచించింది. అంతేకాదు నకిలీ హెల్మెట్లను అంటగట్టే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు పోలీసులు.