అలెర్ట్..రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

0
100

ఇప్పటికే వారాంతాల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈనెల 3వ తేదీన పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

పలు మార్గాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు సైతం రద్దు చేయడంతో హైదరాబాద్‌ వాసులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని భాగ్యనగర వాసులు గమనించాలని కోరారు.

రద్దైన రైళ్ల వివరాలు ఇలా..

లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.