అల్లుళ్లతో నీకు అఫైర్ ఉంది – భార్యపై భర్త నిందలు – చివరకు ఏం చేసిందంటే

అల్లుళ్లతో నీకు అఫైర్ ఉంది - భార్యపై భర్త నిందలు - చివరకు ఏం చేసిందంటే

0
112

50 ఏళ్ల వయసు దాటింది ఈ జంటకు.. ఐదుగురు కుమార్తెలకు వివాహం చేశారు, ఇక మనవళ్లతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాల్సిన సమయంలో వాళ్ల కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భర్తలో రేకెత్తిన అనుమానం చివరకు అతడి ప్రాణాన్నే తీసింది.

ఇక అతని భార్యపై అనుమానం పెంచుకున్నాడు.. ఏకంగా అల్లుళ్లతోనే ఆమెకి అఫైర్ ఉందని నిందలు వేశాడు.

 

అతడు పెడుతున్న చిత్రహింసలను భరించలేక చివరకు కట్టుకున్న మొగుడినే కడతేర్చింది భార్య…ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ సూటిపోటి మాటలతో వేధించసాగాడు.. కొన్ని నెలలుగా భరించింది చివరకు ఆమెలో సహనం నశించిపోయింది.

సొంత అల్లుళ్లతోనే తనకు అక్రమ సంబంధం అంటగట్టడంతో ఆమె భరించలేకపోయింది.

 

భర్త పద్దతి అస్సలు నచ్చలేదు.. దీంతో ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకుని భర్త తలపై ముఖం పై కొట్టింది.

దీంతో భర్త అక్కడికక్కడే మరణించాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు

ఏం జరిగిందా అని విచారణ చేస్తున్నారు పోలీసులు..నిజామాబాద్ లో జరిగింది ఈ ఘటన.