అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు

Ambedkar Open University Degree Exam Dates Finalized

0
95

తెలంగాణ: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ పరీక్షలు జ‌న‌వ‌రి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో సంవ‌త్స‌రం నాలుగో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 18 నుంచి 24వ తేదీ వ‌ర‌కు, డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం రెండో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 27 నుంచి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు www.braouonline.in సైట్‌లో వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి. అనంతరం ప‌రీక్షా ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్లు ద్వారా లేదా డెబిట్ /క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ డిసెంబర్ 23. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంబంధిత ఆధ్యయన కేంద్రాల్లో లేదా 23680241/254 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.