ఆమె గుండె శరీరంలో కాదు బ్యాగ్ లో ఉంటుంది ఈ స్టోరీ తప్పక చదవండి

ఆమె గుండె శరీరంలో కాదు బ్యాగ్ లో ఉంటుంది ఈ స్టోరీ తప్పక చదవండి

0
197

ఎవరికి అయినా గుండె ఎక్కడ ఉంది అంటే శరీరంలో చూపిస్తాం… కానీ ఈ మహిళలకు మాత్రం గుండె బ్యాగ్ లో ఉంటుంది ఇది ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఆరు కిలోల బరువు గల రెండు గుండెలను ఆమె రోజూ బ్యాగ్లో మోసుకెళ్తుంది.

యూకేకి చెందిన సెల్వా హుస్సేన్.. ఆమె ఎక్కడికెళ్లినా సరే తన వెంట ఆ బ్యాగ్ను తీసుకువెళుతుంది. ఎందుకు ఇలా అంటే.

 

సెల్వా 2017లో కారు నడుపుతూ ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడింది. దీంతో ఆమె నేరుగా తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. వారు అన్నీ టెస్టులు చేశారు, ఆమెకి హార్ట్ ఫెయిల్యూర్ అయినట్లు నిర్దారించారు. ఇక నాలుగు రోజుల తర్వాత గుండెలో సపోర్ట్ పంప్ పని చేయలేదు. దీంతో ఆమె గుండె తీసేశారు… వైద్యులు వెంటనే ఆమెకు ఆర్టిఫిషియల్ హార్ట్ ఏర్పాటు చేశారు.

 

దాన్ని కంట్రోల్ చేసే స్పెషలిస్ట్ యూనిట్ను ఆమె వెనుక ఏర్పాటు చేశారు. ఇలా రెండు గుండెలు ఆమె బ్యాగ్ లో పెట్టుకుంటుంది. మొదటి యూనిట్ ఫెయిలైన 90 సెకన్లలోనే రెండో యూనిట్ పెట్టాలి. మరి ఇది ఎలా పని చేస్తుంది అంటే వైద్యులు రెండు పొడవైన ప్లాస్టిక్ ట్యూబ్లను ఆమె కడుపు నుంచి ఆ రెండు యూనిట్లకి కనెక్ట్ చేశారు..

గుండె స్థానంలో ఏర్పాటుచేసిన రెండు బెలూన్లలోకి ఈ పైపులు వెళ్తాయి. ఇవిరక్తాన్ని సరఫరా చేస్తాయి.దీనికోసం ఆమెకి 88 లక్షలు ఖర్చు అయింది.