ఆమె జీతం గంటకి 54 లక్షలు – ఆమె చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా

ఆమె జీతం గంటకి 54 లక్షలు - ఆమె చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా

0
104

10 వేల రూపాయల జీతం రావాలి అంటే ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు.. కానీ ఏకంగా గంటకి రూ.54లక్షల జీతం అంటే ఆశ్చర్యం కలుగుతుందా… అవును టాలెంట్ ఎక్స్ పీరియన్స్ ఉంటే ఆ లెవల్ జీతాలు వస్తాయి, వారి కష్టం కృషికి అంత ఎక్కువ జీతాలు కంపెనీలు ఇస్తాయి… అయితే ఇప్పుడు అంత జీతం పొందుతున్న ఆమె ఎవరు ఆమె స్టోరీ ఆ ఉద్యోగం ఏమిటి అనేది చూద్దాం.

ఆమె పేరు డెనిస్ కొయెత్స్. ఆమెకు 53 ఏళ్లు. బ్రిటన్ లో ఉంటున్నారు, ఆమెకి అక్షరాలా ఏడాదికి జీతం 4 వేల కోట్లు, అంటే ఓ పెద్ద కంపెనీ అధినేతకు వచ్చే జీతం అని చెప్పుకోవాలి. రోజుకు రూ.13 కోట్లు అంటే.. గంటకు రూ.54 లక్షలు సంపాదిస్తున్నారు. అయితే ఇందులో ఆమెకి జీతం అలాగే కంపెనీ వాటా ప్రకారం ఆదాయం వస్తోంది.

ఆమె బెట్ 365 సంస్థ బాస్. ఈమెకు సదరు కంపెనీలో 50 శాతం వాటా ఉంది. ఆ వాటాల నుంచి వచ్చే డివిడెండ్ ఆమె జీతం కలిపి సుమారు ఇలా 48 మిలియన్ పౌండ్లు ప్రతీ ఏడాది వస్తోంది.4742వేలకోట్లుగా ఈమెకు ఆదాయం వచ్చింది, ఇది రికార్డ్ అనే చెప్పాలి.బ్రిటన్ లో అత్యంత సంపన్నమైన మహిళల్లో ఆమెది ఐదో స్థానం. సింపుల్ గా చెప్పాలి అంటే వందమంది పెద్ద కంపెనీల సీఈవోల జీతాల కంటే ఆమె జీతం ఆదాయం ఎక్కువ, రియల్లీ గ్రేట్ ఉమెన్.