సుమ ఇంజనీరింగ్ చదివేది, తండ్రి బియ్యం షాపు నడిపేవాడు, కుమార్తె ఏది అంటే అది ఇచ్చాడు, ఏకంగా ఆమెకి ఐఫోన్ కొనిచ్చాడు, ఈ సమయంలో తన క్లాస్ మేట్ ఆమెకి ప్రపోజ్ చేశాడు, అయితే అతని ప్రేమలో పడింది, అతనితో సినిమాలు షికార్లు చేసింది.
చివరకు తండ్రికి ఈ విషయం తెలిసి ప్రశ్నించాడు, నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని ఓ వారం తర్వాత రాత్రిపూట అతనితో పారిపోయింది, వారం తర్వాత వివాహం చేసుకుని వచ్చారు, అయితే తండ్రి దగ్గరకు వెళ్లడానికి సిగ్గుతో అతని ఇంటికి వెళ్లారు, అక్కడ ఆమెకి అత్తమామలు నరకం చూపించారు. కట్నం కావాలి అని కోరేవారడ, భర్త మంచివాడు అయినా ఆమె ఆ ఇంట్లో ఉండలేకపోయింది.
తర్వాత తండ్రి దగ్గరకు వద్దాము అని భావించినా తండ్రి రానివ్వడు అనే భయంతో ఆమె అలాగే ఉండిపోయింది, చివరకు ఓ రోజు తండ్రికి ఫోన్ చేసి తన బాధ చెప్పింది, తండ్రి మాత్రం ఏమీ మాట్లాడలేదు, అయితే అమ్మకి ఫోన్ ఇవ్వమని అడిగితే, నువ్వు వెళ్లిన వారానికి మీ అమ్మ చనిపోయింది అని చెప్పాడు తండ్రి.. నువ్వు నాకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేశాడు, ఆమె వేసిన రాంగ్ స్టెప్ తో తల్లిని కుటుంబాన్నీ కోల్పోయింది ఆమె. ఇప్పటికీ ఆమె బాధపడుతోంది
గమనిక…
ఇది ఓ యువతి తన బాధని పత్రికకి ఇచ్చి యువత ఆలోచించి వివాహం చేసుకోవాలి అని తెలిపింది