అమెరికాలో జాబ్ అని చెప్పి… ఒక యువతిని….

అమెరికాలో జాబ్ అని చెప్పి... ఒక యువతిని....

0
103

అమెరికాలో జాబ్ బోలెడంత డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నాయని నమ్మించి ఒక యువతిని వివాహం చేసుకున్నాడు… అసలు విషయం తెలుసుకున్న ఆ యువతి మనస్థాపానికి గురి అయి ఆత్యహత్య చేసుకుంది… ఈ సంఘటన సూర్యపేట జిల్లాలో జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

హైదరాబాద్ సీఎల్ కు చెందిన బద్దం శ్రీనివాసరెడ్డి కుమారుడు సాయికిరణ్ రెడ్డికి వినాయకనగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంద్రారెడ్డి కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు.. వివాహం జరుగక ముందు తనకు జాబ్ ఆస్తిపాస్తులు ఉన్నాయని నమ్మించారు శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు సాయికిరణ్ రెడ్డి… అయితే పెళ్లి అయిన వారానికి నవవధువు తన భర్తకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని తెలుసుకుంది…

ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది… దీంతో వారితో వాగ్విదానికి దిగి తన కూతురుని తీసుకు వచ్చారు… తీవ్ర మస్తాపానికి గురి అయిన నవవధువు తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది… తన కుమార్తె చావుకు కారణం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు సాయికిరణ్ రెడ్డిలే అని ఇంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు..