అమ్మనాన్న పై వేడి నూనె పోసిన కూతురు

అమ్మనాన్న పై వేడి నూనె పోసిన కూతురు

0
94

కొందరు తల్లిదండ్రులని దైవంతో సమానంగా చూస్తారు.. మరికొందరు అసలు తల్లిదండ్రులని పట్టించుకోరు.. వారిపై దాడులు చేస్తారు, అలాంటి దుర్మార్గమైన ఘటన ఇది, నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనె పోసి వారిని ఆస్పత్రి పాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణం నెల్లూరులోని జరిగింది ఓ కుటుంబంలో నివశిస్తున్న ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. అయితే ఆమె మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఇక ఆమెకి తల్లిదండ్రులపై ఏ కోపం వచ్చిందో తెలియదు..

రాత్రి అమ్మ నాన్న పడుకుంటే వారిపై వేడి నీళ్లు వేడి నూనె పోసేసింది…. దీంతో దంపతులిద్దరూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. వారిని వెంబడించిన కుమార్తె కారం చల్లేందుకు యత్నించింది. ఇంతలో దంపతులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కూతురు ఎందుకు ఇలాంటి పని చేసిందో అని తెగ షాక్ అవుతున్నారు అందరూ.