అమ్మాయికి 14 అబ్బాయికి 16 …పెళ్లి.. ఆ తర్వాత కాపురం చివరికి ఏమైందంటే

అమ్మాయికి 14 అబ్బాయికి 16 ...పెళ్లి.. ఆ తర్వాత కాపురం చివరికి ఏమైందంటే

0
91

ఇటీవల మైనార్టీ తీరకుండానే చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు యువత.. ప్రేమ అనే మత్తులో ఇలాంటి ఆలోచన చేస్తున్నారు..14 ఏళ్ల ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఆశ్రమ పాఠశాల నుంచి మాయం అయింది. అసలు అమ్మాయికి ఏమైంది అని తెలుసుకోవాలి అని వారి పేరెంట్స్ ఆశ్రమం వారు కంగారు పడ్డారు.

చివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ తమ కుమార్తె తప్పిపోయిందని ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వారి స్టైల్లో విచారణ చేశారు, ఈ మధ్య ఇలా అమ్మాయిలు కనిపించడం లేదు అంటే ముందు వారి ప్రేమ వ్యవహరాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు, ఇక్కడ అదే చేశారు, 14 సంవత్సరాల అమ్మాయి పాఠశాలకు వెళతానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లింది.

అంతే తిరిగి రాలేదు. ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక ఫోటో వచ్చి చేరింది, అందులో ఆమె పెళ్లి చేసుకుంది అనేది కనిపించింది… మైనార్టీ తీరని అబ్బాయిని పెళ్లి చేసుకుంది…దీంతో అందరూ షాక్ అయ్యారు, ఆమె మైనర్ బాలుడితో లేచిపోయి వివాహం చేసుకుంది అని తేలింది, అంతేకాదు వీరిద్దరూ కాపురం పెట్టారట, దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.. అమ్మాయికి 14 సంవత్సరాలు అబ్బాయికి 16 మరి ఏం ప్రేమలో ఏమిటో?