అమ్మాయిలు లిప్ స్టిక్ వాడుతున్నారా ఈ విషయం తప్పక తెలుసుకోండి

అమ్మాయిలు లిప్ స్టిక్ వాడుతున్నారా ఈ విషయం తప్పక తెలుసుకోండి

0
85

చాలా మంది అమ్మాయిలు అందంగా కనిపించేందుకు అలంకరణ చేసుకుంటారు.. ముఖ్యంగా లిప్ స్టిక్స్ చాలా మంది వాడుతూ ఉంటారు వారి పెదాలు మరింత అందంగా ఎర్రగా కనిపించేందుకు వాటికి ఎరుపు రంగు లేదా అనేక రకాల లిప్ స్టిక్స్ వాడుతూ ఉంటారు.. ఇక పెళ్లి ఫంక్షన్లు ఇలా ఏం జరిగినా ఆ మేకప్ కిట్లలో కచ్చితంగా ఇవి ఉంటాయి.

 

ముఖానికి ఎన్ని క్రీములు, పౌడర్లు పూసినా పెదాలకు లిప్ స్టిక్ పెట్టుకుంటారు చాలా మంది అమ్మాయిలు…అయితే వాడటం వాడతారు కాని దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది పెద్ద తెలుసుకోరు… అయితే ఎక్కువగా వాడితే వీటి వల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయి.. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

 

మీరు మీ లిప్స్ కు ఈ స్టిక్ తో పూత రాస్తే మీ పెదాలు డ్రైగా మారతాయి.. అందుకే మీరు లిప్స్ కి ముందు వేజలైన్ మంచి బ్రాండెడ్ ది రాసుకోవాలి… ఇక షైనీగా కనిపించేందుకు లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటే షైన్ గా ఉంటుంది.. లిప్ లైనర్ అప్లై చేస్తూ మొత్తం చుట్టు పక్కల అంటుకోకుండా ఉంటుంది, ఇక ఇది ఎక్కువ సేపు లిప్ కి ఉండాలి అంటే మీరు ముందు కొబ్బరి నూనె కూడా రాసుకోవాలి.

 

తర్వాత వాటర్ తో క్లీన్ చేసి ఆ తర్వా త లిప్ స్టిక్ వాడండి…పెదాలు నల్లగా మారడం జరిగితే మీరు కొద్ది రోజులు ఎలాంటి లిప్ స్టిక్ వాడవద్దు. ఇక పాలతో రబ్ చేస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయంలో లిప్స్ కడుక్కుని ఆ లిప్ స్టిక్ తొలగించి పడుకోవాలి.