ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించినందుకు ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి…

ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించినందుకు ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి...

0
92

కోవిడ్ 19 మన దేశంలోరోజు రోజుకు విస్తరిస్తోంది… దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తోంది… అయితే లాక్ డౌన్ వేళ ఎవ్వరు బయటకు రాకూడదని చెప్పినా కూడా కొందరు యువకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు..

తాజాగా తిరుపతిలో ఆరుగురు వ్యక్తులు జులాయిగా తిరుగుతూ ఒక పాన్ షాప్ వద్ద ఉన్నారు… ఇంతలో ఆ పాన్ షాప్ యజమానురాలు చూసి ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించింది… దీంతో ఆ వ్యక్తులు వృద్దురాలిపై దౌర్జన్యానికి దిగారు… ఆమెపైకత్తితో దాడి చేశారు…

దీన్ని గమనించిన ఆమె కుమారుడు విడిపించేందుకు ప్రయత్నం చేశారు అతని పై కూడా కత్తితో దాడి చేశారు… దీంతో తల్లీ కుమారుడికి స్పల్పంగా గాయాలు అయ్యాయి… ఆ ఆరుగురు వ్యక్తులు కత్తులతో హల్ చల్ చేసిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం వారికోసం పోలీసులు గాలిస్తున్నారు…