అన్నను చంపిన తమ్ముడు… కారణం ఇదే…

అన్నను చంపిన తమ్ముడు... కారణం ఇదే...

0
93

తన అన్న అర్థికంగా ఎదుగుతుండటం చూసి జీర్ణించుకోలేక చంపేశాడు తమ్ముడు… ఈ సంఘటన హైదరాబాద్ లోని సూరారంలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… షాజదాబేగానికి ఇద్దరు కుమారులు..సాబేర్ అనే వ్యక్తి మొదటి భర్తకు జన్మించగా అజం అనే వ్యక్తి రెండో భర్తకు జన్మించాడు… ఈ క్రమంలో సాబేర్ కుటుంబంకు విడిగా ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నడు…

సొంతంగా ట్యాంకర్ నడుపుకుంటున్నాడు.. ఇల్లుకూడా కట్టుకున్నాడు… అజం మెడికల్ స్టోర్ లో పని చేస్తున్నాడు… అన్న అర్ధికంగా ఎదుగుతుండటం చూసి తట్టుకోలేని అజం అతనిని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు… ఈ క్రమంలోనే సాబేర్ భార్య పిల్లలు తన బంధువుల ఇంటికి వెళ్లారు… దీంతో సాబేర్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు…

రాత్రి ఫుల్ గా మద్యం సేవించి అజంకు పోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు… అర్ధిక లావాదేవిల విషయంలో వీరిద్దరి మద్య గొడవ జరిగింది… దీంతో తీవ్ర ఆగ్రహంతో అజం బెడ్ షీట్ తో సాబేర్ మెడకు గట్టిగా బిగించి చంపేశాడు… అతిగా తాగడం వల్లే చనిపోయి ఉంటాడని నమ్మించడానికి ట్రై చేశాడు.. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని విచారిస్తే అసులు విషయం బయటపడింది…