ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు..గుజరాత్ వర్సెస్ హైదరాబాద్

0
111

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 39 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 40 మ్యాచ్ లో తలపడానికి గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా , శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

సన్ రైజర్స్ హైదరాబాద్:  అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ , రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్