వర్షాలతో అతలాకుతలం అయిన ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇంకా వరుణుడు సృష్టించిన జల విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఆ 4 జిల్లాలు. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే టార్గెట్ కాబోతున్నాయి. ఈ వార్తతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక చెన్నై సహా, కడలూరు, మైలాడు దురై, రామనదాపురం, తూత్తుకుడి, నాగపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక రేపు కన్యాకుమారి, తిరునెల్వేలిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.