భార్యపై అనుమానపడే వారు ఉంటారు, భర్తపై అనుమాన పడేవారు ఉంటారు, అయితే ఇది శృతి మించింది అంటే ఇద్దరికి ప్రమాదమే.. చివరకు ఆ కుటుంబాలు విడిపోతాయి, హత్యలకు ఆత్మహత్యలకు దారితీస్తాయి.. పిల్లలు అనాధలు అవుతారు.
అయితే ఓ అనుమానపు భార్య తన భర్తతో వివాదం పెట్టుకుంది, చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది, వారి ఇంటి యజమాని భార్యతో తన భర్త మాట్లాడాడు, దీంతో ఆమె వారిపై అనుమానం పెంచుకుంది, భర్త ఏమీ లేదు అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు, ఈ విషయంపై భర్త సోదరుడు ఆమె కుటుంబ సభ్యులకి చెప్పాడు.
అప్పటికి గొడవ సద్దుమణిగింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో నిద్రలేచిన భార్య, మళ్లీ భర్తతో వివాదం పెట్టుకుంది, దీంతో ఆమె గొంతునులిమి, చీర మెడకు చుట్టి చంపేశాడు, తన భార్య టార్చర్ తట్టుకోలేక చంపేశాను అని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.