వేసవి సెలవులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..

0
109

వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27నుండి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన అనంతరం..వేసవి సెలవులు ప్రకటించనున్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ ప‌రీక్ష‌లు పూర్తి కాగానే వారికి వేస‌వి సెలవులు ప్రకటించనున్నారు. జూనియర్ కళాశాలకు మాత్రం మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది.అంతేకాకుండా జులై 4 నుండి నూతన విద్య సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొద‌లు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎలాంటి  ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది.