ఏపీ ఐసెట్‌ రిజల్ట్స్‌ విడుదల..ఫలితాలను చెక్ చేసుకోండిలా..

0
112

ఏపీ ఐసెట్‌ 2022 పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. కాగా ఈ పరీక్షను ఉన్నత విద్యా మండలి రెండు సెషన్స్‌లో నిర్వహించారు. మొత్తం 107 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్‌ 2022ను నిర్వహించారు.

ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు.  ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్‌ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

రిజల్ట్స్‌ కోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్‌ చేయండి.

అనంతరం హోమ్‌పేజీలో కనిపించే AP ICET- 2022 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విభాగంపై క్లిక్ చేయాలి.

తర్వాత “Download AP ICET Result 2022″ ని ఎంచుకోవాలి.

రిజిస్ట్రేషన్ నంబర్, ICET హాల్‌టికెట్ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.