ఏపీలో తొలి మరణ శిక్ష….

ఏపీలో తొలి మరణ శిక్ష....

0
79

ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై గత సంవత్సరం ఓ కళ్యాణ మండపం వెనక్కి తీసుకువెళ్లి మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.. తాజాగా ఇతనికి న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది…

రాష్ట్రంలో ఫోక్సో చట్టం కింద ఉరి శిక్ష ఇదే తొలిసారి కావడం గమనార్హం.. గత సంవత్సరం చిత్తూరు జిల్లా బీ కొత్త కోటకు చెందిన వారు కుటుంబసభ్యులతో కలిసి కళ్యాణ మండపంకు వచ్చారు… అక్కడ భోజనం చేసి ఆడుకుంటున్న చిన్నారిపై బసినికొండకు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తికి కన్నుపడింది…

ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి కళ్యాణ మండపం వెనక్కి తీసుకుని వెళ్లి చిన్నారిపై అత్యారం చేశాడు… ఆతర్వాత కనికరం లేకుండా గొంతునులిమి చంపి ఎవ్వరికి తెలియకూడదనే ఉద్దేశంతో అక్కడే ఉన్న బావిలో పాడేశాడు ఇంతలో తమ కూతురు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేసి సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు తాజాగా అతడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది…