ఏపీలో మరో దారుణం

ఏపీలో మరో దారుణం

0
102

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళనలు కొనసాగిస్తున్నా మృగాళ్లు, కామాంధులలో మార్పు రాకుంది… దేశం ఏమైతే మాకేంటి అంటూ బరితెగిస్తున్నారు మృగాళ్లు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు…

తాజాగా ఏపీలో ఒక దారుణం జరిగింది ఓ బాలికపై వెంకటేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు… ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలవరం జిల్లాలో జరిగింది… తనపై వెంకటేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది….

ఆమె ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు… ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు…