ఏపీలో మూగ మహిళపై అత్యాచార యత్నం….

ఏపీలో మూగ మహిళపై అత్యాచార యత్నం....

0
124

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, నిందితులకు ఎన్ని శిక్షలు విధిస్తున్నా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది… ఈ చట్టాలు, శిక్షలు తమకు వర్తించవన్నట్లు ప్రవరిస్తున్నారు కామాంధులు… నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి…

చిన్నపిల్లలు, వృద్దులను వదిలిపెట్టడంలేదు కామాంధులు… తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది… ఇరుకుపాలెం గ్రామంలో పొలాల్లో గేదెలు కాస్తున్న మూగ మహిళపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు… మద్యం మత్తులో బలవంతం చేయబోయాడు …

ఇక అతని చేతిలో ఎలాగోలా తప్పించుకున్న ఆ మహిళ విషయం తల్లిదండ్రులకు చెప్పింది… వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…