ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండుటెండల్లో తుఫాను దూసుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ తుఫాన్ దాటికి ఏపీలో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అసని తుపాను దిశ మార్చుకుని ఈశాన్యం వైపు కదులుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. దీని ప్రభావంతో 24 గంటల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనుండడంతో ప్రజలు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
అసని తుపాను దాటికి తీరం వెంబడి 75-95 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం 85కి.మీ వేగంతో గాలులు వీయడంతో పాటు సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. దీని నుండి ప్రజలను కాపాడానికి SDRF, NDRF బృందాలు సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేసారు.