ఏపీ పీజీసెట్-2022 నోటిఫికేషన్‌ విడుదల

0
278

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీపీజీసెట్‌-2022 షెడ్యూల్ ను యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి షెడ్యూలును విడుదల చేసింది. ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్‌, ఒకే ఫీజు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న 16 వర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 147 కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందని వెల్లడించారు.

2022-23 విద్యాసంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. పీజీసెట్‌ను 3 కేటగిరీలుగా విభజించామని, వీటిలో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌ ఉంటాయని ఆయన వెల్లడించారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, డిగ్రీ చివరి సెమిస్టర్‌లో ఉన్న వారు పీజీసెట్‌ రాసేందుకు అర్హులని తెలిపారు.

ఆన్​లైన్​ దరఖాస్తుకు జులై 20వ తేదీ వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు… అలానే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్​లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఆన్​లైన్ దరఖాస్తు, వివరాల కోసం www.yvu.edu.in (లేదా) https://cets.apsche.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.