ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇటీవలే వివిధ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా..తాజాగా విద్యా శాఖలో కొత్త పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. దీనికి సంబంధించి శనివారం అంటే నేడు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
విద్యా శాఖాధికారి-2 (ఎంఈఓ-2) పోస్టును కొత్తగా సృష్టించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. ఇదిలా ఉండగా..ఆ కేటగిరీలో ఒకేసారి 679 పోస్టులను భర్తీ చేసేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా సృష్టించిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.