ఏపీ స్టూడెంట్స్ గెట్ రెడీ: నేటి నుండి పదవ తరగతి పరీక్షలు..

0
105

పదవ తరగతి పరీక్షల కారణంగా ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసిన  విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 అంటే నేటి నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. దీనికోసం ఏపీ విద్యాశాఖ అధికారులు అన్ని సన్నాహాలు చేసుకున్నారు.

కరోనా మహమ్మారి వల్ల వరుసగా రెండు సంవత్సరాలు పదవ తరగతి పరీక్షలు జరగపోవడంతో ఈ ఎడాది పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ వినూత్నమైన మార్పులు చేసింది. ఈ సంవత్సరం 10వ తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ను అందించడం ఇదే తొలి సారి కావడం విశేషం.

పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3800 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం 6,22,537 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఇందులో 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల జరగనున్నాయి.