యాపిల్ కంపెనీ మ‌రో కీల‌క అడుగు – స‌రికొత్త ఫోన్ దీని స్పెషాలిటీ ఇదే

యాపిల్ కంపెనీ మ‌రో కీల‌క అడుగు - స‌రికొత్త ఫోన్ దీని స్పెషాలిటీ ఇదే

0
113
Iphone

ఐఫోన్ అంటే అంద‌రికి ఎంతో క్రేజ్ అంతేకాదు రిచ్ ఫోన్ గా వాడ‌తారు.. ధ‌న‌వంతుల‌కు బ్రాండ్ ఫోన్ గా ఐఫోన్ ని చూస్తారు, అయితే ఏ కొత్త ఫోన్ వ‌చ్చినా ఐఫోన్ నుంచి అది స‌క్సెస్ అయింది. తాజాగా ఐఫోన్ కొత్త మోడల్ వచ్చేస్తోంది. సంస్థ నుంచి 12వ తరం ఫోన్ గా, అక్టోబర్ లో దీన్ని విడుదల చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంద‌ట‌.

అయితే టెక్ నిపుణులు చెబుతున్న దాని ప్ర‌కారం ఈ ఫోన్ విష‌యంలో ఓ కొత్త విష‌యం చెబుతున్నారు ఇది చాలా చిన్నగా ఉంటుందని, కేవలం 5.4 అంగుళాల సైజ్ లో ఉండే దీని పేరు ఐఫోన్ 12 మినీ అని తెలుస్తోంది. అలా కాక‌పోతే ఐఫోన్ 12 మ్యాక్స్అంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది అక్టోబ‌ర్ సెకండ్ వీక్ లో లాంచింగ్ ఉంటుంది అని తెలుస్తోంది..ఇప్పటికే ఐపాడ్, మాక్ కంప్యూటర్లలో యాపిల్ మినీ వర్షన్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ గురించి ఈ న్యూస్ రావ‌డంతో చాలా మంది దిని కోసం వెయిట్ చేస్తున్నారు.