గూగుల్ కు షాకివ్వనున్న యాపిల్ కొత్త సెర్చ్ ఇంజిన్

గూగుల్ కు షాకివ్వనున్న యాపిల్ కొత్త సెర్చ్ ఇంజిన్

0
97

ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలి అన్నా కచ్చితంగా మనకు ఉన్న ది గూగుల్ అనేది తెలిసిందే… ఎన్ని సెర్చ్ ఇంజిన్లు ఉన్నా అందరూ ఎక్కువ గూగుల్ వాడతారు, అయితే ఇప్పుడు గూగుల్ కు పోటీ ఇవ్వనుంది యాపిల్ సంస్ధ..

ఎన్నో ఏళ్లుగా నెంబర్ వన్ సెర్చ్ ఇంజిన్ గా ఉన్న గూగుల్ కు గట్టి పోటీ ఇవ్వాలి అని భావిస్తోంది యాపిల్ కంపెనీ, అయితే గూగుల్ కు మాత్రమే కాదు యాహూ, బింగ్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ ను తేవాలి అని చూస్తోంది యాపిల్.

యాపిల్ తన స్పాట్లైట్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇంజినీర్లను తీసుకుంటుంది. స్పాట్లైట్ అనేది ఎంఏసీ ఓఎస్ లో ముఖ్యమైన శోధన లక్షణం. ఇక్కడ మ్యాక్బుక్ నుంచి వెబ్కు పరిచయాలను శోధించే వీలుంది.ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఓఎస్లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ను ఉంచడానికి ఏటా యాపిల్కు మిలియన్ల రూపాయలు ఇస్తుంది. ఇక వచ్చే ఏడాది ఇది ప్రాజెక్ట్ రెడీ అవ్వనుంది అని తెలుస్తోంది. అయితే ఇది అన్నీ ఫోన్లకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వచ్చే రోజుల్లో తేలనుంది.