స్కాలర్‌ షిప్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానం..పూర్తి వివరాలివే..

0
127

చదువుకు డబ్బు భారం కాకూడదని ప్రభుత్వం స్కాలర్ షిప్ ను తీసుకొచ్చింది. దీనితో పేద విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ క్రమంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సులను అభ్యసించే వారికీ శుభవార్త.

స్కాలర్‌ షిప్‌ కోసం విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సులను అభ్యసించే వారు మేడ్చల్‌ జిల్లాలోని మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2022, జనవరి 1 నుంచి, 2022, జూలై 31 వరకు ప్రవేశం పొంది, అన్ని అర్హతలు, ప్రమాణాలు పూర్తి చేసిన విద్యార్థులు WWW.TELAGANA EPASS.CGG.GOV.IN ఆన్‌లైన్‌లో జూలై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ అధికారి కార్యాలయంలో అన్ని పత్రాలతో దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 7893507922లో సంప్రదించాలని పేర్కొన్నారు.