సెల్ఫీతో ‘దోస్త్‌ ’ దరఖాస్తు చేసుకోండిలా..

0
109

తెలంగాణలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు.

ఈసారి ఇలా కూడా..

విద్యార్థులు సులభంగా, ఇంట్లో నుంచే మొబైల్‌ ద్వారా దరఖాస్తు చేసేందుకు ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కేవలం సెల్ఫీ తీసి, ఫొటోను అప్‌లోడ్‌చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. టీ యాప్‌ ఫొలియో రియల్‌ టైం ఫేస్ రికగ్నిషన్‌ ద్వారా విద్యార్థి వివరాలు దోస్త్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతాయి. ఇదేకాకుండా ఆధార్‌తో లింక్‌ చేయబడిన మొబైల్‌ నంబర్‌, తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌, మీసేవా కేంద్రాల ద్వారా సైతం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని లింబాద్రి వెల్లడించారు.

జులై 1 నుంచి 30 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

జులై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం

సెప్టెంబరు 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

ప్రత్యేకతలు ఇవే..

దోస్త్ 2022 ప్రత్యేకతలు ఇవే..

–కాలేజీలు ఎక్కడున్నాయో ముందుగానే విద్యార్థులు తెలుసుకొనేందుకు కాలేజీల జీపీఎస్ మ్యాపింగ్‌ను దోస్త్ వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. దీని ద్వారా దూరంగా ఉన్న కాలేజీలను ముందుగానే తెలుసుకోవచ్చు.

న్యాక్‌ గుర్తింపు గల కాలేజీల వివరాలను సైతం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

విద్యార్థుల సౌకర్యార్థం 40 హెల్ప్‍లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వాట్సప్‌లో 79010 02200 నంబర్‌లో సంప్రదించి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చు.

దోస్త్ సంబంధిత వివరాల కోసం యూట్యూబ్‌ చానల్‌, ఫేస్బుక్‌, ట్విట్వర్‌లో దోస్త్ ఖాతాను సంప్రదించవచ్చు.